* నారా భువనేశ్వరి గారిని కలిసిన ఎస్.కోట నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి *
విజయనగరం జిల్లాలో నిజం గెలవాలి సంఘీభావ యాత్ర పునఃప్రారంభించేందుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారిని కార్యక్రమంలో భాగంగా బుధవారం శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
* నిజం గెలవాలి *
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురైన విజయనగరం జిల్లాకు చెందిన మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థికసాయం అందించి, మృతుల కుటుంబాలకు భరోసాను ఇచ్చేనందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో వారిని పరామర్శించేందుకు శ్రీకారం చుట్టారని కోళ్ల లలిత కుమారి మీడియాకు వెల్లడించారు.
* విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు *
ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బుద్ధా వెంకన్న, గుమ్మడి సంధ్యారాణి, జడ్పీటీసీ అభ్యర్థి భీశెట్టి అరుణ, మాజీ ఎంపీటీసీ గన్ను బంగారమ్మ, బోనంగి జ్యోతి, పొలిమేర లక్ష్మి, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.