బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ
శృంగవరపుకోట మండలం ఉసిరి గ్రామంలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి కోళ్ల లలిత కుమారి.
శృంగవరపుకోట మండలం ఉసిరి గ్రామం,బూత్ నెంబర్ 51 లో బూత్ ఇంచార్జి గొల్లు అప్పారావు ఆధ్వర్యంలో గురువారం బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ భాగంగా ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తూ, కరపత్రాల పంపణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు *బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ* మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు.
మినీ మేనిఫెస్టో పథకాల వివరాలు
👉 రాబోయే *తెలుగుదేశం* ప్రభుత్వంలో అమలు చేయబోయే మ్యానిఫెస్టోలోని అంశాలు.
👉 *ఆడబిడ్డ నిధి* కింద 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు.
👉 *తల్లికి వందనం* పథకం క్రింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలను ఖాతాల్లో జమ చేస్తారు.
👉 *దీపం* పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం.
👉 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు *ఉచిత ప్రయాణ* సౌకర్యం.
👉 ప్రతి ఇంటికి కుళాయి ద్వారా *సురక్షిత మంచినీటి* సరఫరా.
👉 *అన్నదాత* పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం.
👉 *యువగళం* నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు..
👉 *బీసీలకు రక్షణ* చట్టం తెచ్చి అన్ని విధాల వారికి అండగా నిలుస్తాం.
👉 *పూర్ టు రిచ్* పథకం ద్వారా పేదలను సంపన్నులుగా మార్చే కార్యక్రమం.
*ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు జి.ఎస్.నాయుడు,మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న,బూత్ ఇంచార్జి గొల్లు అప్పారావ్,గొల్లు రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఉసిరి గ్రామ పెద్దలు,జనసైనికులు, యువత, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.