నిజం గెలవాలి సంఘీభావ యాత్ర
విశాఖపట్నం జిల్లాకు నిజం గెలవాలి సంఘీభావ యాత్రలో భాగంగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహాక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ విశాఖలో మర్యాదపూర్వకంగా కలిశారు.
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో నారా భువనేశ్వరి గారికి వీడ్కోలు
అనంతరం కోళ్ల దంపతులు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో నారా భువనేశ్వరి గారికి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ (శ్రీను), విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, విశాఖపట్నం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్ లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.