శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన
ఏలూరు జిల్లా, పోలవరం.
పోలవరం మండలం గోదావరి నది తీరాన కొలువై ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూటాల, కొత్త పట్టిసీమ ,పాత పట్టిసీమ, పోలవరం పరిసర గ్రామాల నుండి భక్తులు మహిళలు సుమారు 4 వేల మంది పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాల స్వీకరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తాంజనేయ స్వామి ఉత్సవాలు ముగింపు సందర్భముగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కరిబండి రాంబాబు, సెక్రటరీ సుంకర అంజిబాబు, క్యాషియర్ పి వెంకట శ్రీనివాస్, సుంకర కొండబాబు, వైసీపీ సీనియర్ నాయకులు మైగాపులు దుర్గాప్రసాద్, ఆకుల బజ్జీలు, దొరబాబు, నర్రా సత్తిబాబు, మహేష్, కట్టా నాని, గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.