అంగన్వాడీల 22 వ రోజు సమ్మెకు మంగళవారం టిడిపి నాయకులు సంఘీభావం
ఏలూరు జిల్లా,పోలవరం.
అంగన్వాడి ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని టీడీపీ పోలవరం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు హితవు పలికారు. అంగన్వాడీల 22 వ రోజు సమ్మెకు మంగళవారం టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 రోజులుగా అంగన్వాడీలు సమ్మెలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లయినా లేకపోవడం అమానుషమన్నారు. 22 రోజులుగా మాతా శిశువులు గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం అందక రక్తహీనతతో అవస్థలు పడుతుంటే చర్చల పేరిట జాప్యం చేయడం సరికాదన్నారు.
అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.
అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబు, పట్టిసీమ సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి, మండల తెలుగు యువతా అధ్యక్షులు పివివి సత్యనారాయణ,మాజీ టిడిపి మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు,కుంచే దొరబాబు,పోతుల శ్రీనివాసు, జల్లేపల్లి వెంకట నరసింహారావు, పాదం ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.