డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సాధారణ ఎన్నికలపై అవగాహన సమావేశం
మోతుగూడెం .
జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా , రంపచోడవరం ఓఎస్డీ కేవీ మహేశ్వర రెడ్డి , చింతూరు ఏఎస్పీ రాహుల్ మీనా , చింతూరు సీఐ గజేంద్ర ఆదేశాల మేరకు డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బచ్చులూరు, నర్సింగ్ పూర్ మరియు బిర్రిగుడా గ్రామాల్లో డొంకరాయి ఎస్సై శివ కుమార్ అవగాహన సమావేశం నిర్వచించారు.
రానున్న సాధారణ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో
ఈ సందర్బంగా ఎస్సై శివ కుమార్ మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూసుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. యువత చెడు మార్గాలవైపు వెళ్లకుండా, గంజాయి జోలికి పోకుండా కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలని కోరారు.
యువత గంజాయి మరియు చెడు అలవాట్లుకు దూరంగా
అనంతరం యువత గంజాయి మరియు చెడు అలవాట్లుకు దూరంగా ఉండటం కోసం క్రీడలు వైపు ఉండాలని ఎస్పీ తూహిన్ సిన్హా ఆదేశాల మేరకు బచ్చూలురు, నర్సింగపూర్ గ్రామస్థులకు వాలీబాల్ కిట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డగండి సర్పంచ్ వేమా సంధ్యారాణి , వాలంటీర్లు, హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్, కానిస్టేబుల్స్ పోసయ్య, గంగరాజు పాల్గొన్నారు.