కష్టపడి పనిచేసే ప్రతీ తెదేపా నాయకులకు, కార్యకర్తలకు...!
లక్కవరపుకోట:
జయహా బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి.
కష్టపడి పనిచేసే ప్రతీ తెదేపా నాయకులకు, కార్యకర్తలకు ఆర్థికంగా స్థిరపడేలా చేస్తూ, వారి కష్టనష్టాలలోనూ అండ ఉంటామని బరోసాను ఇచ్చిన కోళ్ల దంపతులు.
లక్కవరపుకోట మండలం, రంగరాయపురం గ్రామం, విశాఖ - అరకు హైవే రహదారి పక్కన మామిడి తోటలో బుధవారం ఎల్.కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు & టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ఎల్.కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లునాయుడు మరియు క్లస్టర్ ఇంచార్జ్ లు కరెడ్ల ఈశ్వరరావు, కొల్లి వేంకట రమణ మూర్తి సారథ్యంలో బుధవారం జయహా బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్.కోట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి ఒబ్బిన సత్యనారాయణ (సత్తిబాబు), రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్, విశాఖ టిడిపి పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి అన్సూరి మధు సూదనరావు, విశాఖ టీడీపీ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, విశాఖ టిడిపి పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్టర్, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ (శ్రీను), రాష్ట్ర వెలమ సాధికార సమితి సభ్యులు గండి విజయ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, అందుకు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. మాకు అన్ని విధాల మేలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే ప్రతీ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేస్తూ, వారి కష్టనష్టాలలో కూడా అండగా ఉంటామని బరోసాను ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ ఉమ్మడి టీడీపీ - జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ అఖండ మెజరిటీతో గెలుపొందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపేందుకు, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టడానికి, యువత ఉపాధి అవకాశాలు, బరోసా ఇవ్వడం కోసం, బీసీ లకు ప్రత్యేక చట్టాలు అమలు చేయడానికి అవసరమైన నిధులు మంజూరు కావడం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవశ్యకత ఎంతైనా ఉంది అని అన్నారు.
బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు..
బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉంటారని, వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఆదరణ పథకాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, సబ్ ప్లాన్ నిధులు, బీసీ భవనాలు, విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బీసీ కులగణన, నామినేటెడ్ పదవులు వంటి అన్ని అవకాశాలు దొక్కుతాయని అన్నారు. అంతేకాకుండా విద్యార్థి, విద్యార్థులకు విద్యారంగంలోనూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక ఎదుగుదల, బలహీన బడుగు వర్గాలన్నీOటికి రాజకీయ పురోభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల వంటివి కూడా ఉంటుందని తెలిపారు.