బదిలీపై వెళ్తున్న తహసిల్దార్ బి సుమతి..
ఏలూరు జిల్లా, పోలవరం.
పోలవరం మండలంలో తాహసిల్దార్ గా బత్తుల సుమతి చేసిన సేవలు ఎనలేవని పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సోబ్బన రాజశేఖర్ బాబు అన్నారు.
డిప్యూటీ తహసిల్దార్ ప్రసాదరావు అధ్యక్షతన..!
మూడు సంవత్సరాలకు పైగా పోలవరం మండలంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న బి సుమతికి డిప్యూటీ తహసిల్దార్ ప్రసాదరావు అధ్యక్షతన రెవిన్యూ కార్యాలయం సిబ్బంది గురువారం రాత్రి వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎస్ ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు ఆమె చేసిన సేవలు గురించి కొనియాడారు.ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో సిబ్బంది తో ఆమె కలసి పనిచేసిన విధానాన్ని, ప్రతి ఒక్కరితో కలసిపోయే మంచితనాన్ని ,ప్రజలతో మమేకమైన తీరును సిబ్బంది గుర్తు చేసుకున్నారు.
ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏజెన్సీ గ్రామాలను ఖాళీ చేయడంలోనూ..!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏజెన్సీ గ్రామాలను ఖాళీ చేయడంలోనూ , వారందరికీ ప్యాకేజీ ఇప్పించడంలోనూ, వరదలు, తుఫాను సమయంలోనూ, పట్టిసీమ ఉత్సవాల విధి నిర్వహణలో తహసిల్దార్ గా బి సుమతి ఎంతో చాకచక్యంగా వ్యవహరించే వారిని ఈ సందర్భంగా ప్రశంసించారు.
తాహసిల్దార్ కి పలువురు ప్రశంసలు...!
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ప్రసాదరావు, జూనియర్ అసిస్టెంట్ వెంకటరత్నం, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ రామ్నాథ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు, వీఆర్వోలు ,వీఆర్ఏలు,కంప్యూటర్ ఆపరేటర్లు,తదితరులు పాల్గొన్నారు..