అనుమతుల్లేవ్.. అడిగేటోళ్లు లేరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ.
నిబంధనలకు తూట్లు.. ఇష్టా రాజ్యంగా...!
అనుమతుల్లేవ్.. అడిగేటోళ్లు లేరు.. ఇంకేముంది గుట్టలను తవ్వేస్తున్నారు. రూ.లక్షల విలువ చేసే మట్టిని దోచుకెళ్తున్నారు. ఇలా అక్రమార్కులకు మట్టి వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తుండగా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.పాల్వంచ మండలంలోని *కేటీపీఎస్ యాష్ పౌండ్ నిర్మాణానికి పునుకుల*,*తోగూడెం* తదితర గ్రామాల శివారులోని ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఉదయం, రాత్రి వేళల్లో నిత్యం అక్రమంగా జేసీబీల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యల ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.అక్రమార్కులు మట్టిని తవ్వి ప్రకృతి సంపదను కొల్లగోడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మట్టి గుట్టలు ఉండడంతో కొందరు చోటా, బడా నాయకులు, అనుచరులు ఈ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న నియంత్రించే నాథుడే కరువయ్యారు.