ఏలూరు జిల్లా పోలవరం.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంను
పోలవరం మండలం పోలవరం పంచాయతీ సచివాలయం 2 పరిధిలో సర్పంచ్ పొడుం పుష్ప అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపిపి సుంకర వెంకట రెడ్డి,సర్పంచ్ పొడుం పుష్ప ,ఎంపిడిఓ జి శ్రీను, పిఓపిఆర్టి శ్రీనివాసరావు, సెక్రటరీ వై కొండలరావు, డాక్టర్ కే మురళీధరన్,డాక్టర్ వాసు,డాక్టర్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ కాశి ధనలక్ష్మి పాల్గొని ఆరోగ్యశ్రీ బ్రోచర్ లోని ప్రతి విషయాన్నీ ఆరోగ్యశ్రీ పథకం యొక్క లక్ష్యాల్ని , ప్రయోజనాల్ని
ప్రజలకు వివరించారు.శిబిరం వద్దకు వచ్చిన రోగులకు అవసరమైన పలు రకాల పరీక్షలు జరిపి వైద్య సేవలు అందించారు. అవసరమైన వాళ్లకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి కుటంబంలో కనీసం ఒక్కరి ఫోన్ లో ఐనా ఇన్ స్టాల్ చేసుకోవాలని, ఆరోగ్యశ్రీ యాప్ లో ఉన్న ప్రతి ఆప్షన్ నూ తెలుసుకోవాలని సూచించారు.ప్రజలకు వైద్యాన్ని మరింత చెరువు చేయాలని క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది, వాలంటరీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.