50 వేల విలువ చేసి గంజాయి పట్టివేత
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద 10 కేజీల గంజాయిని పట్టుకున్నారు.పై అధికారుల ఆదేశాల మేరకు వారు తెలిపిన వివరాల ప్రకారం మోతుగూడెం పోలీస్ స్టేషన్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న హోండా యాక్టివా స్కూటర్ ను ఆపి తనిఖీ చేయగా అందులో 10 కేజీల గంజాయిని ,ఇద్దరు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది.పట్టుకున్న ముద్దాయిలు , జి కళ్యాణ్ కుమార్ , కే నరేందర్ ,ఈ 10 కేజీల గంజాయి విలువ సుమారు 50 వేలు ఉంటుందని తెలియజేశారు.
ఈ గంజాయిని సీలేరు నుండి హైదరాబాద్ కి హోండా యాక్టివా మీద తరలిస్తున్నారని తెలియజేశారు. వీరు ఇద్దరు వ్యక్తులు జొమేటోలోని డెలివరీ బాయ్స్ గా మరియు ఓలా క్యాబ్ లోని డ్రైవర్లుగా పనిచేస్తున్నారని ఎస్సై జి. గోపాలరావు తెలియజేశారు .ఈ గంజాయిని సీలేరు నుండి హైదరాబాద్ కి హోండా యాక్టివా మీద తరలిస్తున్నారని, వీరిపై కేసు నమోదు చేసి వీరి వద్దనుండి హోండా యాక్టివా స్కూటర్ ను మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.ఈ తనిఖీలలో , ఎస్సై జి గోపాలరావు , ఏఎస్ఐ రాజేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ రవిచంద్ర , మురళి , రాజు,కానిస్టేబుల్ సన్యాసి రావు, సుబ్బారావు, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.