సమస్యలు పరిష్కారం కోసం ఛలో విజయవాడ
నిడదవోలు: రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన ఆశా కార్యకర్తలపై ప్రభుత్వ యంత్రాంగం. పోలీసులు నిర్భందకాండను నిరసిస్తూ పట్టణంలో ఆశా వర్కర్స్ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం. రైల్వే స్టేషన్. బస్ స్టాండ్ సంత మార్కెట్ అంబేడ్కర్ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చి నాయకులు కామ్రేడ్ ధనలక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని అరెస్ట్ చేయించటం. వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా నిలుస్తోందని విమర్శించారు. ఆశా వర్కర్స్ కి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు అరెస్ట్ చేసిన నాయకుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. హైమావతి. నాగ లక్ష్మి. బేబీ. హేమలత. జ్యోతి. దేవి. దుర్గా దేవి తదితరులు పాల్గొన్నారు