ఏలూరు జిల్లా, పోలవరం.
మత్స్యకారుల కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నదులలో చేప పిల్లల విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అన్నారు. పోలవరం మండలంలో గూటాల, పాత పోలవరం గ్రామాల వద్ద గోదావరి నదిలో చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమాన్ని మత్స్య శాఖ అధికారులు బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొని గోదావరి మాతకు పూజలు చేసి నదిలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అందులో భాగంగానే గోదావరి నదిలో చేప పిల్లలను వదలడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న చేప పిల్లలను చిర్ మెన్ వల వేసి పోలవరం గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా పడుతున్న సుదూర, సముద్ర తీర ప్రాంతాల జాలర్లను కట్టడి చేసేవిధంగా చర్యలు తీసుకుని స్థానికంగా నివాసం వుంటూ చేపల వేట జీవనాధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించాలని కోరారు.
అనంతరం డి ఎఫ్ నాగలింగాచార్యులు మాట్లాడుతూ నదులలో సహజంగా ఏర్పడే మత్స్య సంపద మత్స్యకారుల జీవనోపాధికి సరిపోదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏలూరు,బాదంపుది మత్స్య కేంద్రాల నుండి సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయల విలువ చేసే 21 లక్షల 10 వేల చేప పిల్లలను గోదావరి నదిలో వదలడం జరిగిందని అన్నారు. దీనితో స్థానికంగా ఉన్న మత్స్యకారులకు జీవనోపాధి మెరుగుపడుతుందని ఆయన అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి జాలర్లు వచ్చి చిన్న వలలతో చిన్న చిన్న చేపలను పట్టడం జరుగుతున్నదని కలెక్టర్ దృష్టికి వచ్చిందని ఇక్కడ పరిస్థితులను పరిశీలించి కలెక్టర్ కు నివేదిక అందించడం జరుగుతుందని అన్నారు. సుధూవర ప్రాంతాల నుంచి చేపల వేటకు వచ్చేవారిని అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో
ఏలూరు జిల్లా మత్స్య శాఖ అధికారి కె ఎస్ వి నాగలింగాచార్యులు, బాదంపూడి సహాయ సంచాలకులు బీ నర్సయ్య, పోలవరం మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు,ఏలూరు ఎఫ్డిఓ దివ్య, వి ఎఫ్ ఏ లు ఎస్ జయ, సుదా లక్ష్మి, కే సుబ్రహ్మణ్యం, గూటాల సొసైటీ అధ్యక్షులు సుంకర అంజిబాబు, వీఆర్ఓ బి వినయ్ కుమార్, మత్స్యకారులు పాల్గొన్నారు..