ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామం జెడ్పి హై స్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చితంగా సరఫరా చేస్తున్న టాబ్లను అందజేసిన *నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జి శ్రీనివాస్ నాయుడు*.
ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్ విధానంలో పాఠ్యoశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా... మెరుగైన చదువులు దిశగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలోకి అడుగుపెట్టిన పిమ్మట ప్రతి విద్యార్థికి ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు పంపిణి చేస్త్తూ , ఆఫ్ లైన్లో కూడా పనిచేసే విదంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నిడదవోలు నియజవర్గంలో మొత్తం 1824 ట్యాబ్లు మంజూరయ్యాన్నారు.
నిడదవోలు నియోజకవర్గం లో గత నాలుగున్నర సంవత్సర కాలంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు, పాటశాలలో మౌలిక వసతులు మెరుగు పరచడానికి జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠశాలలో నాడు నేడు, వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాల ద్వారా నిడదవోలు నియోజకవర్గంలో సుమారు రూ. 272.76 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.
విద్యార్థులు *మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ జి శ్రీనివాస్ నాయుడు కి అభినందనలు తెలిపారు*
ఎమ్మెల్యే తో ఉండ్రాజవరం మండల జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, గ్రామ ఎంపీటీసీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జేసియస్ మండల ఇంచార్జి, విద్యాకమిటీ చైర్మన్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల విద్యాశాఖాధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థినిలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.