- నేను ఎల్లప్పుడూ ప్రజలకు సేవకుడినే.
NN1NEWS: 23.Sept.తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు మండలం, డి.ముప్పవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందని ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నిడదవోలు మండలం డిమప్పవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ వందరోజుల ప్రగతిని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ,సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక భద్రత పెన్షన్లను పెంచిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రూ. 2000 నుండి రూ. 3000 కి పెన్షన్ పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పెన్షన్ ను నాలుగు వేలకు పెంచి ప్రజలకు ఒకటవ తేదీనే గుమ్మం వద్ద అందించింది అన్నారు.
అంతేగాక ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ లను జూలైలో ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీలను పునరుద్దరించామని తద్వారా పేద ప్రజల కడుపు నింపుతున్నామన్నారు. 16,000 కు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన చేశామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో దీపావళి నుండి ప్రజలకు మూడు ఉచిత సిలిండర్లు అందజేయనున్నారు..