- విద్యుత్ కాంతులతో అమ్మవారి రథోత్సవం..
NN1NEWS 11 Oct. ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల. శ్రీ క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, కుంకుళ్ళమ్మ వారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం అమ్మవారిని రథోత్సవం ద్వారా తిరువీధులలో గ్రామోత్సవం జరిగింది. మేళ తాళాలతో, బాణా సంచాలతో అమ్మవారి వేషధారణములు,కోలాటాలతో,విద్యుత్ కాంతులతో అమ్మవారి రథోత్సవం,అంగరంగ వైభవంగా ద్వారకాతిరుమల గ్రామ తిరువీధులలో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.