వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు.
NN1NEWS. Oct 02:
నిడదవోలు ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్ మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుకు నడిపించి, శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్రం రావడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని వివరించారు. మన దేశ ప్రతి పౌరుడు ఆయన నేర్పించిన శాంతి మార్గం అలవర్చుకొని అదే మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర కె.వి.వి.పి రంగారావు, వైస్ ప్రెసిడెంట్ గంగుల గోపి యాదవ్, వనిత వాకర్స్ క్లబ్ సెక్రటరీ ఏ వెంకట రమణమ్మ,యోగ గురువు సానపు సుబ్బారావు.
భూరుగుపల్లి రాము, నీలం నాగేంద్రప్రసాద్,
కాళ్ల రాంబాబు, సెటిల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.