108 ను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజామద్దత్తు కోరుతున్న సిబ్బంది*
రాష్ట్రంలోని 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ 108 సిబ్బంది ప్రభుత్వానికిసమ్మె నోటీసు ఇవ్వడం విధితమే.ఈ కార్యక్రమంలో భాగంగా చాగల్లు మండలం 108 సిబ్బంది ప్రజా మద్దతును కూడగట్టేందుకు కరపత్రాలను పంపిణీ చేశారు.అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న మా పట్ల దయ చూపించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది శివ నాగేశ్వరరావు శ్రీధర్ రమేష్ నాయుడు సతీష్ పాల్గొన్నారు.