Nn1news.
మండల ప్రజా పరిషత్ కార్యాలయము లోని సమావేశ మందిరము నందు సోమవారం ఉదయం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ మట్టా వీరాస్వామి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశము జరిగింది.ప్రస్తుతం MLC ఎన్నికల కోడ్ మరియు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రీత్యా పరిచయ సమావేశముగా ఏర్పాటు చేయడం జరిగింది.గోపాలపురం మండలం నుండి బదిలీ పై చాగల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి గా బాధ్యతలు తీసుకున్న శ్రీమతి ఆర్ శ్రీదేవి ఆధ్వర్యంలో తొలి సమావేశము కావున కార్యవర్గ సభ్యులతో పరిచయ సమావేశముగా జరిగింది.ఈ కార్యక్రమములో ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మండల స్థాయి అధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.