NN1NEWS.చాగల్లు:-చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ వీర్రాజు సస్పెన్షన్ గురయ్యారు. ఈ మేరకు కాకినాడ ఆర్.జె.డి జి.నాగమణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు వీర్రాజు విధుల్లో అలసత్వం వహించడంతో పాటు అనర్హులకు టీసీలు విక్రయించారని నిర్ధరించడంతో సస్పెన్షన్ కు గురైనట్లు తెలిసింది. సస్పెన్షన్ కాలంలో జిల్లా కేంద్రాన్ని దాటి వెళ్ళరాదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గత ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన వీర్రాజు సస్పెండ్ అవడంతో చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.
Post a Comment
0Comments
3/related/default