NN1NEWS Nov-14...
తూర్పుగోదావరి జిల్లా, చాగల్లు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం కార్యదర్శి గారపాటి వెంకట సుబ్బారావు,మండల అధ్యక్షుడు కంకటాల బుద్ధుడు,సిపిఎం మండల అధ్యక్షుడు కామిశెట్టి దుర్గారావు,భవన నిర్మాణ కార్మికుల ప్రెసిడెంట్ షేక్ ఆదం, సెక్రటరీ కే తాతారావు ఇంచార్జ్ తహసిల్దార్ టి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రైతులకు కూటమి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ విధమైన రైతు భరోసా ఇవ్వలేదని,కరెంటు రోజుకు 9 గంటలు ఇవ్వటం లేదని,రైతులకు నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వం పంపిణీ చేయాలని,ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు అద్వానంగా తయారయ్యాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్లు వేయాలన్నారు.
దుర్గారావు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ ప్రయాణికులకు బస్సు షెల్టర్ లేదని ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వెంటనే బస్ షెల్టర్ ని కట్టాలన్నారు.
బుద్ధుడు మాట్లాడుతూ చాగల్లు గ్రామంలో సుమారు 8సంవత్సరాల క్రితం జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడింది.వేలాది మంది కార్మికులు బతికే వారిని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే ఎంతోమంది కార్మికులకు అన్నం పెట్టిన వారవుతారని అన్నారు.