చాగల్లు ఫోటో స్టూడియో అధినేతలు మజ్జిగ వితరణ.
*చాగల్లు ప్రధాన కూడలిలో మజ్జిగ వితరణ.........*NN1NEWS. ఏప్రియల్ 05.
చాగల్లు మండల కేంద్రం, చాగల్లు గ్రామానికి చెందిన ఫోటో స్టూడియో అధినేతలు తమ ఉదారతను చాటుకున్నారు. మండుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పాదచారులకు,ద్విచక్ర వాహనదారులకు,సుదూర ప్రాంతాలకు వెళ్లే బాటసారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.శనివారం ఉదయం నుండి మెయిన్ రోడ్ నందు గల సురేష్ స్టూడియో అండ్ వీడియో షాపు నందు ఏర్పాటుచేసిన మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఫోటో స్టూడియో అధినేతల సంకల్పాన్ని పలువురు పాదచారులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కొవ్వూరు సెక్రటరీ గల్లా రాజు,కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఊర్వశి స్టూడియో కుమార్ మరియు స్టూడియో అధినేతలు పాల్గొన్నారు.