పాల్వంచలో రేవంత్ రెడ్డి, మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం
NN1NEWS. ఏప్రియల్ 04.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ.బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం. రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల. పాల్వంచలో రేవంత్ రెడ్డి, మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకంలో పాల్గొన్న కొత్వాల.
తెలంగాణా రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని *రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.
శుక్రవారం *పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీ* లో గల చౌక దుకాణాన్ని *కొత్వాల* సందర్శించారు. తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణి చేస్తున్న సన్న బియ్యంను *కొత్వాల* పరిశీలించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* ల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో *కొత్వాల* మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల బాగోగుల కోసం ప్రభుత్వం తోపాటు *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* కృషి చేస్తున్నారన్నారు. *గతంలో రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణి చేసేవారని, గత ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం* చుట్టిందని *కొత్వాల* అన్నారు. ప్రజలు సన్న బియ్యం పంపిణి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని *కొత్వాల* కోరారు.
ఈ కార్యక్రమంలో *కాంగ్రెస్ నాయకులు SVRK ఆచార్యులు, కాల్వ భాస్కరరావు, దేవి లాల్, బాలినేని నాగేశ్వరరావు, చింతా నాగరాజు, పైడిపల్లి మనోహర్, Y వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, SK చాంద్ పాషా, పైడిపల్లి మహేష్, నల్లమల్ల సత్యం, పులి సత్యనారాయణ, వాసుమల్ల సుందర్ రావు, సందు ప్రభాకర్, ఉండేటి శాంతివర్ధన్, షేక్ బాషా, రాములు నాయక్, గండమల్ల రాము, లింగ్య నాయక్, కటుకూరి శేఖర్, కొత్తపల్లి రవి, Md షఫి, R శ్రీనివాస్*, తదితరులు పాల్గొన్నారు.