జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజలక్ష్మి ,కమీషనర్ రమేష్ తో కలసి సచివాలయం అడ్మిన్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు, వాలంటీర్స్ మరియు RPS తో కలసి సమావేశం నిర్వహించడం జరిగింది.
సమావేశంలో బాగంగా చైర్ పర్సన్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వార్డులు వారిగా ఈ రోజు వరకు మీరు ప్రజలకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంబంధించి ఎంత వరకు తీసుకొని వెళ్లారాని?ఎంత వరకు సర్వే చేశారని? టెస్టులు ఎంత వరకు జరిగాయని వాలంటీర్ కు, హెల్త్ సెక్రటరీ లకు , అడ్మిన్స్ కు అడిగి తెలుసుకున్నారు. అందరూ కూడా సర్వే బాగా జరుగుతుందని,
ప్రజలు కూడా టెస్ట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని ,95%వరకు సర్వే పూర్తి చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం ప్రజల ముందుకు తీసుకొస్తున్నారని,కాబట్టి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.