రాజాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండ్రు పర్యటన.
NN1NEWS. రాజాం.ది 02_03_25
విజయనగరం జిల్లా, రాజాం నియోజక వర్గం ఎమ్మెల్యే కొండ్రు పర్యటన.
మాజీ మంత్రి రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ ఆదివారం బొద్దూరు ఎంపీటీసీ వల్లూరు గణేష్ ఆధ్వర్యంలో బిళ్ళాని జంక్షన్ వద్ద నిర్వహించిన,బొద్దూరు గ్రామదేవత దేశాలమ్మతల్లి ఉత్సవంలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ తూర్పు కాపు కార్పోరేషన్ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు తో పాటు నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
అనంతరం రాజాం తెదేపా కార్యాలయంలో రేగిడి మండలం కొర్లవలస గ్రామానికి చెందిన బంకి లక్ష్మీ అనే మహిళ ఇటీవల అనారోగ్యం కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆమె చికిత్స నిమిత్తం రూ..81000 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేసారు*
అలాగే ఈ నెల 9 ,10, 11వ తేదీలలో రాజాం పొలిపల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను ఆలయ ధర్మకర్తలు సభ్యులు అందజేశారు.
అనంతరం రాజాం జామియా మసీదుకు రాష్ట్ర ప్రభుత్వం 50000వేల రూపాయల గౌరవ వేతనం చెక్కును ఇమామ్ యండి యస్సీన్, మెజర్ అబ్ రహీమ్ కు అందజేసి,పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.