మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన
NN1NEWS. మార్చ్ 02.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బిగ్ టీవీ, వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పల్స్ హస్పటల్ వారిచే నిర్వహిస్తున్న మెగా ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది.
బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100కు పైగా మెడికల్ క్యాంపులు మార్చ్ 2వ తేదీన నిర్వహించడం ప్రేక్షకులకు విధితమే. నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వార్తలను అందించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని దృక్పథంతో బిగ్ టీవీ చేపట్టిన మెగామెడికల్ క్యాంపుకు నిడదవోలు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఈ మెగా మెడికల్ క్యాంపును నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు అమర శ్రీలక్ష్మి పల్స్ హస్పటల్స్ డాక్టర్లు వంశీకృష్ణరాజు, కొల్లూరు లక్ష్మణ్ లతో పాటు పల్స్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది, నిడదవోలు వాకర్స్ క్లబ్ వనిత వాకర్స్ క్లబ్ సభ్యులు, సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.