అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళిలు.
విజయనగరం జిల్లా, రాజాం నియోజక వర్గం. NN1NEWS.ఏప్రియల్ 14.రాజాం టౌన్
భారత రాజ్యాంగ నిర్మాత & భారత రత్న డా||బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళిలు అర్పించిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్.
డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజాం టౌన్ లో అంబేద్కర్ కూడలి లో వున్న అంబేద్కర్ విగ్రహంనకు మరియు బొబ్బిలి రోడ్ లో గల చిన్న హరిజన వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహంనకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన డా. తలే రాజేష్*
ఈ సందర్భంగా *డా.తలే రాజేష్ * మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శ వంతం అని, ప్రతీ విద్యార్థి కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర కోసం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని, ఒక ఇంటిని నడపాలి అంటేనే ఎన్నో రకాల ఇబ్బందులు యెన్నో రకాలుగా ఆలోచన చేయాలి అలాంటిది ఒక దేశానికి దశ దిశా నిర్దేశం చేయాలంటే యెన్నో రాజ్యాంగాలను తెలుసుకొని ఇతర దేశాలు అనుసరిస్తున్న విధి విధానాలను అనుసరించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఒక దళితుడు అయి ఉండి కూడా ఆ రోజుల్లో నిర్మించారు అంటే సాధారణ విషయం కాదని అన్నారు.
అంబేద్కర్ అనగానే అందరూ కేవలం రిజర్వేషన్ ల వరకే ఆలోచిస్తున్నారు కానీ ఆయన రచించిన రాజ్యాంగం వలన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సమాజంలో సముచిత స్థానం ఉందంటే అది అంబేద్కర్ రాజ్యాంగం వలనే అని గుర్తు చేశారు.
మహిళలకు ఆస్తిలో వాటా హక్కు మరియు ఉద్యోగ బాలింతలకు మెటర్నిటీ సెలవులు, రోజుకి 12 గంటల పనిని 8 గంటలకు కుదించించేటట్లు చేసిన ఘనత డా. బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగందేనని అన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పినట్లు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేబినెట్ లో చోటు కల్పించి,5 గురికి డిప్యూటీ సిఎం పదవులు ఇచ్చి,కులం మతం చూడకుండ ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తే,
ఈ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఇది మంచి పద్ధతి కాదని, పగలు రాత్రి వుంటాయి అలానే గెలుపు ఓటములు వుంటాయి, పగలు తర్వాత రాత్రి ఎలా వస్తుందో ఈ రాజకీయ చీకటిలో ఉన్న మనమందరం కూడాను రేపటి పగలును చూస్తామని నమ్మకం మనకు వుందని అన్నారు.
ప్రపంచంలో మన దేశంకి ప్రజాస్వామ్యం పరంగా ఎంత విలువా ప్రాముఖ్యత ఉంది కానీ,
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అంబేద్కర్ రాజ్యాంగం కి బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి గెలిపించిది అభివృధి కోసం, సంక్షేమం కోసం తప్ప దాడులు,అరాచకాలు చేయటం కోసం కాదు అని తెలియజేశారు.
కూటమి నాయకులు అలోచన చేసి ఏ ఏ హామీలు ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలుచేయడానికి చూడాలి తప్ప , అవి అన్నీ గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల ఛీత్కారంకి గురవుతున్నారనే విషయం మీరు తెలుసుకోవాలన్నారు.
ఆనంతరం ఇంటర్మీడియట్ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులు అయినా విద్యార్థి విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఏ తలే భద్రయ్య ,రాజాం టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాస రావు , రేగిడి మండల పార్టీ అధ్యక్షులు వావిలపల్లి జగన్ మోహన్ రావు , రాజాం రూరల్ పార్టీ అధ్యక్షులు లావేటి రాజగోపాల్ నాయుడు , జడ్పీటీసీ బండి నరసింహులు , మాజీ PACS అధ్యక్షులు వాకముల్ల చిన్నం నాయుడు , టౌన్ సీనియర్ నాయకులు దూబ గోపాలం మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.