ఘనంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.
గోకవరం. NN1NEWS.ఏప్రియల్ 14.
ఘనంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.... తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం దళితుల ఆశాజ్యోతి విద్యావంతుడు రాజ్యాంగ రచయిత అంబేద్కర్ జయంతి వేడుకలు గోకవరం సంజీవయ్య నగర్ యువ నాయకులు పెద్దలు గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా జయంతి వేడుకలు జరిగాయి వేడుకల్లో స్త్రీలు పిల్లలు పెద్దలు అందరూ పాల్గొని అంబేద్కర్ కి బాణా సంచాలతో తీన్మార్ వాయిద్యాలతో ఘనంగా ఈ వేడుకలు జరిగాయి మరి ముఖ్యంగా అంబేద్కర్ దళితులకే కాకుండా ప్రపంచం అందరికీ స్ఫూర్తిదాయకం అని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ జయంతిని జరిపారు.