అంబేద్కర్ విగ్రహానికి కూనంనేని సాంబశివరావు పూలమాలవేసి నివాళులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ. NN1NEWS. ఏప్రియల్ 14.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్134వ జయంతి పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.