గలఅమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన.
*సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన**నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ*
*కొత్తగూడెం బస్టాండ్ వద్ద గలఅమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన*
*జర్మనీ యువతిపై, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువతిపై సామూహిక అత్యాచారం చేసిన వారిని ఉరితీయాలి*
*ప్రపంచ దేశాల్లో ఉన్న కఠినమైన చట్టాలు, భారతదేశంలో లేకపోవడం చాలా బాధాకరం*
*ప్రపంచ దేశాలలో మహిళలను సామూహిక అత్యాచారం చేసిన, మానభంగం చేసిన నడిరోడ్డులో ఉరి తీసే చట్టాలు భారతదేశంలో కూడా రావాలని సఖి జాతీయ మహిళా మండలి కోరుకుంటుంది*
జర్మనీ యువతి ఒక శుభకార్యం నిమిత్తం భారతదేశానికి, హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. ఆ మహిళ తిరుగు ప్రయాణంలో క్యాబ్ డ్రైవర్ నేను విమానాశ్రయంలో దించుతానని అబద్ధం చెప్పి తన మిత్రులతో కలిసి మధ్యదారిలో సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. వెంటనే చేరుకున్న జర్మనీ మహిళ అక్కడి స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది
నాగర్ కర్నూలుకు చెందిన మరొక మహిళ తన స్నేహితుడితో కలిసి ఆంజనేయస్వామి టెంపుల్ ను దర్శించుకుని వెళ్తుండగా ఆ టెంపుల్ కి చెందిన ఒక కాంట్రాక్ట్ కార్మికుడు తన మిత్రులను పిలవడం జరిగింది. మద్యం సీసాలతోవచ్చిన 8 మంది ఆ మహిళను తెల్లవార్లు సామూహిక అత్యాచారం చేస్తే, ఆ మహిళ మంచినీళ్లు మంచినీళ్లు అని కేకలు వేస్తుంటే వాళ్లు ఆమె నోటిలో మూత్రం పోయడాన్ని సఖి జాతి మహిళా మండలి తీవ్రంగా ఖండిస్తుంది. ఆ స్నేహితుని చెట్టుకు కట్టివేసి ఆ మహిళపై సామూహిక అత్యాచారం మద్యం మత్తులో 8 మంది చిత్రహింసలకు గురి చేయడం మానవ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మహిళలకు రక్షణ లేదు. మహిళల మానప్రాణాలకు రక్షణ లేదు. భారతదేశంలో చట్టాలలో మార్పు రావాలి. పార్లమెంటులో పటిష్టమైన చట్టాలు తేవాలి. మహిళల అత్యాచారం చేస్తే వెంటనే నడిరోడ్డులో ఉరి తీసే చట్టాలు భారతదేశంలో అమలు అయినప్పుడే మహిళలపై అత్యాచారాలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది. అటువంటి పటిష్టమైన చట్టాలను పార్లమెంట్లో తేవాలని సఖీ జాతీయ మహిళా మండలి కోరుకుంటుంది
*మే నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి మహిళల కోసం పటిష్టమైన చట్టాలు తేవాలని సఖి జాతీయ మహిళా మండలి ప్రయత్నం చేస్తుంది*
*ఈ కార్యక్రమంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరమ్మ, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమరం సత్యవతి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ , కొత్తగూడెం టౌన్ ఇంచార్జ్ విజయలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి , కొత్తగూడె టౌన్ ఉపాధ్యక్షురాలు నర్సమ్మ కొత్తగూడెం టౌన్ ప్రధాన కార్యదర్శి సునీత, నేషనల్ కమిటీ సభ్యురాలు సౌమ్య, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతకుమారి, నేషనల్ కమిటీ సభ్యురాలు హేమలత, జిల్లా కమిటీ సభ్యురాలు రాధా, పద్మ, కురుసం లక్ష్మి, నేషనల్ జాయింట్ సెక్రటరీ భద్రాచలం ఇన్చార్జి కుంజా రమాదేవి తదితరులు పాల్గొన్నారు*